News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News April 2, 2026

ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.

News April 2, 2026

ADB: తొలిరోజు JEE ప్రశాంతం.. ఏడుగురు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్‌లలో పరీక్ష జరిగింది. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 80 మంది విద్యార్థులకు గాను 73 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నారవ్ తెలిపారు. మధ్యాహ్నం కూడా ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు.

News April 2, 2026

ఈనెల 5న అధికారికంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

ఈనెల 5న బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి మహోత్సవాన్ని ఆదిలాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తునట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలల అలంకరణ కార్యక్రమం, ఆ తర్వాత ఎస్టీయూ భవనంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరై మహనీయుని జయంతి విజయవంతం చేయాలని కోరారు.