News February 5, 2025
పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..

పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ రియాక్షన్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ ఎన్నికవడంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ అన్నారు. ఆయన సెలక్షన్ వల్ల ఇరాన్ మళ్లీ అదే సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబాను హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త లీడర్‌గా ఎవరొచ్చినా ఎక్కువ కాలం ఉండబోరని.. వారినీ అంతం చేస్తామని అమెరికా గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 10, 2026
గ్యాస్ సరఫరా లేక హోటళ్లు బంద్!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిషేధించలేదని కేంద్రం స్పష్టం చేసినా గ్రౌండ్ లెవెల్‌లో సప్లై జరగడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. ‘సిలిండర్ల సరఫరాలో గృహాలకు ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం చెప్పడంతో అయోమయం నెలకొంది. దీనిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇవ్వాలి’ అని Xలో కోరింది. కాగా గ్యాస్ సరఫరా లేక ఇవాళ్టి నుంచి హోటళ్లు బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.


