News February 5, 2025
సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?

అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.
Similar News
News July 4, 2025
సిరిసిల్ల: ‘బడ్జెట్ కూర్పులో ఘనపాటి’

బడ్జెట్ కూర్పులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఘనపాటి అని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు.
News July 4, 2025
గద్వాల జిల్లా పోలీసులకు 12 పతకాలు: ఎస్పీ

జోగులాంబ జోనల్-7 స్థాయి పరిధిలో రెండు రోజులు నాగర్ కర్నూల్లో నిర్వహించిన “పోలీస్ డ్యూటీ మీట్”లో గద్వాల జిల్లా పోలీస్ అధికారులు ప్రతిభ కనబరిచి 12 పతకాలు సాధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 3 బంగారు, 6 రజత, 3 కాంస్య పతకాలు ఉన్నాయని చెప్పారు. వాటిని జిల్లా పోలీసు అధికారులు జోగులాంబ జోన్ -7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
News July 4, 2025
KNR: 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ల సస్పెండ్

కరీంనగర్లోని ఓ ప్రవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది. డాక్టర్స్ డే రోజు జరిగిన కార్యక్రమంలో తమ పెండింగ్ స్టైఫండ్ నిధులను రిలిజ్ చేయాలని నిరసన వ్యక్తం చేసినందుకే తమని సస్పెండ్ చేశారని విద్యార్థులు వాపోయారు.