News February 5, 2025
సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?
అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.
Similar News
News February 5, 2025
1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
News February 5, 2025
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
News February 5, 2025
ChatGPT, డీప్‌సీక్‌పై నిషేధం
రహస్య సమాచారం, పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉండటంతో ఛాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి అన్ని రకాల AI టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్‌పెండీచర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, దీపమ్, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న, కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది.