News March 19, 2024

మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు: తమిళి సై

image

తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు మాజీ గవర్నర్ తమిళి సై కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ & పుదుచ్చేరికి చెందిన సోదర, సోదరీమణులు, తల్లులు, పెద్దలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళి సై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 12, 2025

పాలలో వెన్న శాతం పెరగాలంటే..

image

పాల కేంద్రాల్లో వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న ఎక్కువగా 6%-8%, దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4-4.5%, సంకర జాతి పాడి పశువుల పాలలో 3-4% వెన్న ఉంటుంది. పప్పుజాతి పశుగ్రాసాలను, గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను, జొన్నచొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా పశువులకు అందించాలి. ఇవి లేనప్పుడు ఎండు వరిగడ్డిని పశువుకు మేతగా ఇస్తే పాలలో వెన్నశాతం తగ్గదు.

News September 12, 2025

నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

image

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.

News September 12, 2025

సరస్వతీ దేవి రూపం ఎందుకు విశిష్టమైనది?

image

చదువుల తల్లి సరస్వతీ దేవి జ్ఞానం, కళలు, ధ్యానాలకు ప్రతీక. ఆమె చేతిలో ఉండే వీణ సంగీతం, సృజనాత్మకతను సూచిస్తే, పుస్తకం మేధో జ్ఞానానికి సంకేతం. జపమాల ధ్యానాన్ని, ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ మూడు అంశాలు కలిసినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. ఆమె వాహనం హంస. ఇది విచక్షణా శక్తికి ప్రతీక. ఇది మంచి చెడులను వేరుచేసి, సరైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ రూపం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దర్పణం.