News February 5, 2025
నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు

సాఫ్ట్‌వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు.
Similar News
News April 6, 2026
శాంతి భద్రతల పరిరక్షణే కార్డన్ సెర్చ్ లక్ష్యం: SP

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు
గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. తాడేపల్లి పరిధి సలాం సెంటర్ పరిధిలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేశారు. అనంతరం స్థానిక యువకులతో డ్రగ్స్ వద్ద బ్రో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీతో పాటు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ వీరేంద్ర సిబ్బంది ఉన్నారు.
News April 6, 2026
గుంటూరులో 5 రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి ప్రణాళిక

గుంటూరు జిల్లాలో 5 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ROB నిర్మాణానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. శ్యామలనగర్, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అమరావతి ఈ-13 రోడ్, నంబూరు-మంగళగిరి మార్గాల్లో అధ్యయనం చేపడతారు. ఈ నెలలోనే కన్సల్టెన్సీ ఎంపిక చేసి DPR సిద్ధం చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా నెహ్రూనగర్, సంజీవయ్యనగర్ గేట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. 2 సంవత్సరాల్లో దశలవారీగా పనులు పూర్తి చేయనున్నారు.
News April 6, 2026
గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. అత్యధికంగా రెంటచింతలలో గరిష్ఠం 42, కనిష్ఠం 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 40-27 డిగ్రీలుగా రికార్డయ్యాయి. అలాగే గుంటూరులో 38-25, తెనాలిలో 37-25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలైన బాపట్ల, చీరాలలో గరిష్ఠం 35, కనిష్ఠం 26 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


