News February 5, 2025

బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పులి సంచారం

image

వారం రోజులుగా పెద్దపులి సంచారం 2 మండలాల అటవీ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధి బుగ్గగూడెం అటవీ ప్రాంతం, కాసిపేట దుబ్బగూడెం, పెద్దనపల్లి ఏరియాల్లో సంచరిస్తోంది. బుధవారం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారి పూర్ణచందర్ తెలిపారు.

Similar News

News March 20, 2026

యుద్ధం కొనసాగితే LPG సప్లయ్ చైన్‌కు దెబ్బే: CBN

image

AP: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే LPG గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని CM CBN ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు VCలో సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, PNG వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్‌కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు.

News March 20, 2026

SKLM: రేపు టెన్త్ పరీక్ష వాయిదా

image

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ప్రభుత్వం శనివారం (మార్చి 21) సెలవు ప్రకటించింది. ఆ రోజు జరగాల్సిన పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన, ఓపెన్ స్కూల్ గణితం, భారతీయ సంస్కృతి పరీక్షలు 30వ తేదీన జరుగుతాయన్నారు.

News March 20, 2026

‘పిరికిపందలు’.. నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!

image

ఇరాన్‌పై పోరులో నాటో దేశాలు భాగం కాకపోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. US లేకపోతే నాటో ఎందుకూ పనికిరాదని విమర్శించారు. ఆయిల్ ధరలపై ఆ దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ హార్ముజ్‌ను క్లియర్ చేసేందుకు మాత్రం సహాయపడట్లేదన్నారు. హార్ముజ్‌ను క్లియర్ చేయడం ఆ దేశాలకు సులువైన పనేనని అన్నారు. ఈ వైఖరిని గుర్తుపెట్టుకుంటానన్న ట్రంప్.. నాటో దేశాలను పిరికిపందలుగా అభివర్ణించారు.