News February 5, 2025

కొమురవెల్లి: గుండెపోటుతో టీచర్ మృతి

image

సిద్దిపేట జిల్లాలో గుండెపోటుతో టీచర్ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం మరి ముచ్చాల గ్రామానికి చెందిన అశోక్(50) టీచర్. ఇటీవలే కొమరవెల్లి ZPHS ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన దుబ్బాక మండలం దుంపలపల్లి పాఠశాలకు పీఈటీగా బదిలీపై వెళ్లారు. కాగా ఈ ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News February 5, 2025

సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రెడ్డి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంఘం నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News February 5, 2025

అనకాపల్లి: ‘దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు’

image

అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన 15 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు సాధారణ లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. గీత కులాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News February 5, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు.

error: Content is protected !!