News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 14, 2026
కొమురవెల్లి మల్లన్న దర్శించుకున్న సీపీ

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సీపీ రష్మి పెరుమాల్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈనెల 18న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, క్యూలైన్, సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2026
కైలాస వాహనంపై ఆది దంపతులు

శ్రీశైలం క్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి దంపతులు సంక్రాంతి ఉత్సవాలు పురస్కరించుకుని బుధవారం రాత్రి కైలాస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా స్వామి, అమ్మ వారిని విశేషంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టగా వేలాది భక్తులు దర్శించుకున్నారు.
News January 14, 2026
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్‌లోని US మిలిటరీ బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్‌లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.


