News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News March 31, 2026

ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

image

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.

News March 31, 2026

ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు

image

భారత్ నుంచి ఏప్రిల్‌లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్కడి పంజాబ్ ప్రావిన్స్‌లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. దీంతో పాటు లాహోర్, కర్తపూర్, ఎమినాబాద్, ఫరూఖాబాద్, నాన్‌కనా సాహిబ్ వంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ ఏటా వీరి కోసం ప్రత్యేక ‘జథా’ వీసాలు కల్పిస్తోంది.

News March 31, 2026

‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్!

image

ఈ డిజిటల్ యుగంలో ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉండాలంటే బ్యాకప్ తప్పనిసరి. ఇందుకు 3-2-1 రూల్ ఫాలో అయితే మంచిదంటున్నారు నిపుణులు. ఓరిజినల్ డేటా కాక మరో రెండు అంటే మొత్తం 3 కాపీలు ఉండాలి. రెండు వేర్వేరు స్టోరేజీల్లో ఈ డేటా సేవ్ చేయాలి. మీ సిస్టమ్‌లో ఒకటి ఉంటే మరోటి హార్డ్‌డ్రైవ్‌లో పెట్టుకోవాలి. ఇక మరో కాపీ క్లౌడ్ సర్వర్‌లో స్టోర్ చేసుకోవాలి. దీంతో డేటా నష్టాన్ని నివారించొచ్చు. ఈరోజు వరల్డ్ బ్యాకప్ డే.