News February 5, 2025

కామారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!

image

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. కామారెడ్డి జిల్లాలో 536 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Similar News

News March 14, 2026

వికారాబాద్: టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయన్నారు. బాలురు 6,740 మంది, బాలికలు 6774మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు నిర్వహించనున్నారు. 9:30నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవ్వనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

News March 14, 2026

కామారెడ్డి: పది పరీక్షలకు 13,154 మంది విద్యార్థులు

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు డీఈవో రాజు తెలిపారు. వీరిలో 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 65 పరీక్షా కేంద్రాలు, 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 739 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన వివరించారు.

News March 14, 2026

HYD: 600 ఎకరాల భూమి వేలం!

image

బడ్జెట్‌లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్‌పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని క్యాబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.