News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News September 18, 2025

సంగారెడ్డి: 20న ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు ఈనెల 20న సంగారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బాలబాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9494991828 నెంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News September 18, 2025

బీడీ కార్మికుల పిల్లలకు మరో అవకాశం..!

image

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖానా మెడికల్ ఆఫీసర్ డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాల పేరు పోర్టల్లో కనిపించకపోతే సమస్యలను wclwohyd@nic.inకు పంపాలన్నారు. సందేహాలుంటే 9966621170కు కాల్ చేయవచ్చన్నారు.

News September 18, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.