News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News March 20, 2026

పాడేరు: పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు- కలెక్టర్

image

జిల్లాను పర్యాటకంగా మూడు క్లస్టర్లుగా అభివృద్ధి పరిచేందుకు సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ట్రెక్కింగ్‌కు అనుకూలంగా క్రాస్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొండచరియల బాట అభివృద్ధి, స్థిరీకరణ, నీటి పారుదల, కోత నియంత్రణ, మార్గదర్శనం, సంకేతాలు అభివృద్ధి చేయాలన్నారు.

News March 20, 2026

కొండగట్టు అంజన్నకు బడ్జెట్లో చోటేది..?

image

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి చోటు దక్కకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, వేములవాడ వంటి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కొండగట్టు ప్రస్తావనను విస్మరించింది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఈ క్షేత్రానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని భక్తులు మండిపడుతున్నారు.

News March 20, 2026

మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

image

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.