News February 5, 2025

చర్చనీయాంశంగా మారిన దేవినేని ఉమ ట్వీట్

image

ట్విటర్, వేదికగా రేషన్ మాఫియాపై మాజీమంత్రి దేవినేని ఉమ సంచల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయవాడ సిటీ పోలీస్, ఎన్టీఆర్ కలెక్టర్‌ని ట్యాగ్ చేశారు. వైసీపీ హయాంలో దోపిడీ చాలదన్నట్లు ఇంకా మైలవరంలో రేషన్ దోపిడీ అంటూ పోస్ట్ చేశారు. మాఫియా ఆట కట్టిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం ఓ వాహనంలో పోలీసుల తనిఖీలో మైలవరంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం వేదికగా రాజకీయం ముదురుతోంది. 

Similar News

News February 24, 2026

KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

News February 24, 2026

విండీస్ గెలుపుతో టెన్షన్‌లో టీమ్‌ఇండియా

image

T20 WC సూపర్-8లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిన ఇండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. విండీస్ కొట్టిన భారీ స్కోరు, మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల భారత్ ఒత్తిడిలో పడింది. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News February 24, 2026

కామారెడ్డిలో జాబ్ మేళా

image

కామారెడ్డిలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.