News March 19, 2024

NZB: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News July 7, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

News July 7, 2025

NZB: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.