News February 5, 2025

ఏలూరులో ఏసీబీ దాడులు..ఫుడ్ సేఫ్టీ అధికారిని అరెస్టు

image

ఏలూరు నగరంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం..ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి బుధవారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. అధికారితో పాటు ఆఫీసు సబార్డినేట్ పుల్లారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాధికారుల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ, అధికారులు ఉన్నారు.

Similar News

News November 6, 2025

రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

image

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)

News November 6, 2025

HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

image

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

News November 6, 2025

నంద్యాల: గమ్యం చేరాలంటే సాహసం చేయాల్సిందే..!

image

మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకడం కష్టంగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు పని నిమిత్తం వెళ్లే వారికి అవస్థలు ఎదురవుతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినా గమ్యం చేరడానికి సాహసం చేయక తప్పడం లేదు.