News February 5, 2025
తీన్మార్ మల్లన్నపై వేటు?

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.
Similar News
News March 27, 2026
కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.
News March 27, 2026
GK: చంద్రయాన్-3 విశేషాలు

⋆ ప్రయోగం తేదీ: జులై 14, 2023
⋆ చంద్రుడిపై ల్యాండింగ్: AUG 23, 2023
⋆ రాకెట్ పేరు: LVM3-M4, ల్యాండర్: విక్రమ్, రోవర్: ప్రజ్ఞాన్
⋆ చంద్రయాన్-3 ల్యాండయిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
⋆ ల్యాండింగ్ తేదీని కేంద్రం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది
⋆ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్
⋆ US, రష్యా, చైనా తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ చేసిన 4th దేశంగా భారత్
News March 27, 2026
కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇలా చేస్తే..!

కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎదుటివారిపై చూపకుండా మనసును ఇంట్లోని పనుల మీదకు మళ్లించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘వాష్‌రూమ్ క్లీనింగ్‌కు టైమ్ కేటాయిస్తే అది పూర్తయ్యేలోపు కోపం తగ్గుతుంది. అలాగే వంట చేయడం, చెప్పులు శుభ్రం చేసుకోవడం, ఫ్రిజ్‌లోని ఐటమ్స్ చక్కగా అరేంజ్ చేయడం, అద్దాలు శుభ్రం చేయడం వంటివి అనుసరించాలి. దీంతో ఇల్లు శుభ్రం కావడంతో పాటు కోపం నుంచీ బయటపడొచ్చు’ అని సూచిస్తున్నారు.


