News February 5, 2025
ముంబైలో ‘లండన్ ఐ’ ఏర్పాటు చేస్తాం: BMC

లండన్‌లోని భారీ జెయింట్ వీల్ ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోనూ భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తాజాగా సమర్పించిన రూ.74వేల కోట్ల బడ్జెట్‌లో దాని గురించి ప్రస్తావించింది. ఇంకా స్థల సమీకరణ జరగని నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించలేదని వెల్లడించింది. ఏసీతో కూడిన క్యాప్సూల్‌లో ప్రయాణికులు ముంబై నగరాన్ని ఎత్తు నుంచి తిలకించవచ్చని పేర్కొంది.
Similar News
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
2 రాష్ట్రాల ఎన్నికలు.. రూ.865 కోట్లు సీజ్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్, తమిళనాడులో ఇప్పటి వరకు రూ.865 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ECI వెల్లడించింది. ఇందులో రూ.99 కోట్ల నగదు, రూ.84 కోట్ల విలువైన 32.91 లక్షల లీటర్ల లిక్కర్ ఉన్నాయని తెలిపింది. అలాగే రూ.174 కోట్ల డ్రగ్స్, రూ.159 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.350 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పేర్కొంది.
News April 17, 2026
ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్ర కరెక్ట్ కాదు: RGV

ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్రను తప్పుగా చూపించారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘దావూద్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడని, ఏ పనీ చేయట్లేదని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. అతడు క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయినట్లు నమ్ముతున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా భారత్‌లో అలజడి సృష్టించేందుకు దావూద్ అక్కడి ISIతో కలిసి కుట్రలు పన్నినట్లు ఈ మూవీలో చూపించారు.


