News February 5, 2025
BREAKING: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

AP: విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410KMగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న AP రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు, విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్‌పాడ్ రూట్లను సికింద్రాబాద్‌కు మార్చింది. ఈ జోన్ పరిధిలోకి VSP, VJA, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి.
Similar News
News March 7, 2026
జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.
News March 7, 2026
ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.
News March 7, 2026
మమతకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ: ద్రౌపదీ ముర్ము

WB పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్రపతికి CMతో పాటు అధికారులెవరూ స్వాగతం పలకలేదు. అటు సిలిగుడిలోని సభకు అనుమతి ఇవ్వకుండా వేదికను గోసైన్‌పూర్‌కు మార్చడంపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ‘మమతకు నాపై కోపం ఉండొచ్చు. కానీ నాకు ద్వేషం లేదు. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆదివాసీలు ఏకం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.


