News February 5, 2025

గూగుల్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ

image

AP:గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్‌తో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

Similar News

News March 23, 2026

మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

image

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.

News March 23, 2026

ఈ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య: మాజీ CIA

image

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య అని మాజీ CIA లియోన్ పనెట్టా విమర్శించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందని తెలిసినా ట్రంప్ యంత్రాంగం ముందస్తు ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి దిగిందని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా మరింత కఠినమైన నాయకత్వం చేతుల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. USలో పెరుగుతున్న ఇంధన ధరలు, 59% ప్రజల వ్యతిరేకత ట్రంప్‌ను ఇరకాటంలో నెట్టాయన్నారు.

News March 23, 2026

యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

image

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.