News February 5, 2025
రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్

రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.
Similar News
News January 15, 2026
వెంటనే USతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి: థరూర్

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25% సుంకాలు విధిస్తాననడంపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 50% సుంకాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారీ సుంకాలు చెల్లించి USకు ఎగుమతులు చేయడం ఏ భారతీయ కంపెనీకీ సాధ్యం కాదని.. మన వస్తువుల ధరలు పెరిగి పోటీలో వెనుకబడతామని థరూర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే USతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
News January 15, 2026
మల్లూరు నరసింహుని సన్నిధిలో మంత్రి సీతక్క

సంక్రాంతి సందర్భంగా మంత్రి సీతక్క మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న వరపూజ మహోత్సవం విశేషాలను ఈవో మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
News January 15, 2026
APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.


