News March 19, 2024
విజువల్ వండర్‌గా ‘రాజాసాబ్’: నిర్మాత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘రాజాసాబ్ సినిమాలో భారీగా VFX సన్నివేశాలు ఉంటాయి. మీరు ఊహించని విధంగా స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం కల్కి సినిమా ఉన్నందున దాని విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. రిలీజైన వెంటనే మా మూవీ కంటెంట్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తాం’ అని తెలిపారు.
Similar News
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.
News July 6, 2025
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.