News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే

➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం
Similar News
News July 6, 2025
చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జునసాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.
News July 6, 2025
రాయచోటిలో ఘోర ప్రమాదం

రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి-మదనపల్లె మార్గంలోని ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో మృతదేహం ఛిద్రమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
పటాన్‌చెరు: మానవ అవశేషాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

సిగచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి అవశేషాల అప్పగింత సజావుగా జరగాలని కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటివరకు 42 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 8 మంది గల్లంతవగా, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.