News February 5, 2025

గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.

Similar News

News March 21, 2026

నార్నూర్: రూ.2,40,000 విలువగల గంజాయి స్వాధీనం

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 21, 2026

వారికి ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరిక..!

image

ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.

News March 21, 2026

ADB: గ్యాస్ డెలివరీలో అలస్యమైతే.. కాల్ చేయండి

image

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.