News February 5, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు.
Similar News
News February 27, 2026
బాల్య వివాహాలను అరికడదాం: ఎంపీ రఘునందన్

సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన రథాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
News February 27, 2026
అనకాపల్లి: 310 విద్యార్థుల గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 27, 2026
బ్లడ్ బాత్.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు కోల్పోయి 81,287కు, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద స్థిరపడింది. దాదాపు ₹5లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, HCL, ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత, FII సెల్లింగ్, US-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడం, రూపీ పతనం ఎఫెక్ట్ చూపించింది.


