News February 5, 2025
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రెడ్డి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంఘం నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 5, 2025
రేపు సీఎల్పీ సమావేశం
TG: రేపు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. మ.3 గంటలకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 5, 2025
NTR: మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు
ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు కేటాయించిన 11 మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువును ఈ నెల 5 నుంచి 8 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి S. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు ఈ నెల 7వ తేదీ కాకుండా 10 తేదీ ఉదయం 9 గంటల నుంచి గొల్లపూడిలోని BC భవన్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు.
News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్‌పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్‌పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.