News February 5, 2025

రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలి: BHPL కలెక్టర్

image

రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికకు 215 మంది పురుషులు, 114 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 14, 2026

ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

image

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.

News March 14, 2026

శివంపేట: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 14, 2026

ఈరోజు నమాజ్ వేళలు (14-3-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.