News February 5, 2025

NRPT: బావిలో మునిగి బాలుడు మృతి

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News September 16, 2025

మేడారం గద్దెల విస్తరణలో వ్యూహాత్మకంగా ముందుకే..!

image

మేడారం వన దేవతల గద్దెల విస్తరణలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే జాతరలో ఇరుకైన ఈ ప్రాంగణం విస్తరణకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా సాధ్యం కాలేదు. ప్రస్తుత సర్కారు ప్రయత్నం మొదలు పెట్టింది. ఆదివాసీ సంఘాలు విబేధించడం, రాజకీయ ప్రమేయం పెరగడంతో మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పూజారులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. విమర్శలకు చెక్ పెడుతున్నారు.

News September 16, 2025

చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

image

ఇటీవల నంద్యాల మీదుగా ప్రయాణించే విధంగా ప్రకటించిన చెర్లపల్లి-తిరుపతి – చర్లపల్లి (07013/07014) వీక్లీ రైలును కార్యాచరణ పరిమితుల దృష్ట్యా అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రద్దు చేశారు. దీనికి బదులుగా ఆ నెలల్లో 07001/07002 నంబర్ గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. రైలు సమయాలలో ఎటువంటి తేడా లేదు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

News September 16, 2025

ADB: మేక గుండె ప్రదర్శన

image

మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సునీత విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధించారు. ఆమె స్వయంగా మేక గుండె, కిడ్నీలు తెచ్చి, వాటి నిర్మాణం, పనితీరును ప్రత్యక్షంగా వివరించారు. ఈ ప్రయోగాత్మక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అవగాహన భవిష్యత్తులో వైద్యులుగా రాణించే వారికి ఉపయోగపడుతుందని హెచ్‌ఎం శైలజ అభినందించారు.