News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
Similar News
News January 25, 2026
HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

ఈ ఎడాదికి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.
News January 25, 2026
HYD: వారిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష..!

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణ వ్యక్తి దివ్యాంగుడిని లేదా దివ్యాంగురాల్ని వివాహమాడితే రూ.లక్ష ప్రోత్సాకాన్ని అందిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా శిశు, మహిళా సంక్షేమ అధికారి తెలిపారు. వరుడు లేదా వధువు 40% దివ్యాంగత సర్టిఫికెట్ కలిగి ఉండి పెళ్లైన ఏడాదిలోపు మ్యారేజ్ సర్టిఫికెట్‌తో అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
News January 23, 2026
ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.


