News February 5, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2026
ADB: పాపం.. పల్లెల గొంతెండుతోంది..?

వేసవి భానుడు భగభగమంటుంటే, ఉమ్మడి జిల్లాలోని పల్లెల గొంతు ఎండుతోంది. చుక్క నీటి కోసం జనం అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ గొట్టాలు వెక్కిరిస్తుంటే, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల ప్రజలు కిలోమీటర్ల దూరం నడచి వాగుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. చంటిపిల్లలు, వృద్ధులు సైతం ఎండను లెక్కచేయక దప్పిక తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పైప్‌లైన్ల లీకేజీలు, అధికారుల నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారాయి.
News March 16, 2026
విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 16, 2026
కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.


