News February 5, 2025
సిరిసిల్ల: మాతా శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్

మాతా శిశు మరణాలను అరికట్టాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాత శిశు మరణాలు జరగకుండా మొదటిసారి గర్భం ధరించిన తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి గర్భధారణ చెకప్ లు ఆశా కార్యకర్తల ద్వారా ఏఎన్ఎం ద్వారా చెకప్ లు సకాలంలో చేయించాలన్నారు.
Similar News
News March 28, 2026
రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం FCI వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 28, 2026
నాయుడుపేట: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట – పూతలపట్టు NH71 జాతీయ రహదారిపై అక్కగారిపేట సమీపంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ దాము(54)ను గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీకొట్టి పరారైంది. పలమనేరు గ్రామానికి చెందిన దాము అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నాయుడుపేట పీహెచ్‌సీ మార్చురీకి తరలించగా, ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2026
విశాఖ పోర్టుకు భారీ LPG నౌక

విశాఖపట్నం పోర్టుకు BW Birch అనే భారీ LPG నౌక చేరుకుంది. సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో వచ్చిన ఈ నౌక ప్రస్తుతం అన్‌లోడింగ్ ప్రక్రియలో ఉంది. స్థానిక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ సరకు అత్యంత కీలకం కానుంది. పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో గ్యాస్‌ను సేఫ్‌గా నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖకు చేరుకోవడం విశేషం.


