News February 5, 2025
WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News April 3, 2026
13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 3, 2026
మెదక్: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
News April 3, 2026
జగిత్యాల: మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తుల గడువు పెంపు

జగిత్యాల పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలిన మైనారిటీ సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్ తుంగూరి సుచిత్ర తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ, సీఈసీ-40 సీట్ల చొప్పున భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. సకల సదుపాయాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తామని ప్రిన్సిపల్ చెప్పారు.


