News February 5, 2025
VJA: ‘ఆపదలో ఈ నంబర్లకు ఫోన్ చేయండి’

జక్కంపూడి YSR కాలనీలోని ZP హైస్కూల్ విద్యార్థులకు పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లత కుమారి పాల్గొన్నారు. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు 1930, 112 తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలల రక్షణకు అమలవుతున్న పలు చట్టాల గురించి వివరించారు.
Similar News
News March 17, 2026
ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.
News March 17, 2026
టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్‌లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్‌ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.
News March 17, 2026
ప్లాస్టిక్ ధరల పెరుగుదల.. కీలక రంగాలకు సెగ

కేరళంలోని ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ముడిసరకు ధరల పెరుగుదల, మూలధన కొరతతో మూతపడుతున్నాయి. దీనివల్ల FMCG, ఫుట్‌వేర్, హెల్త్‌కేర్ సెక్టార్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 20-25% యూనిట్లు ఆపరేషన్స్ నిలిపివేసినట్లు కేరళ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫలితంగా బాటిళ్లు, సోల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలు పెరిగాయి.


