News February 5, 2025
కడెం: ‘పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి’
మండలంలోని ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి చైతన్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎంపీవో కవిరాజుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 6, 2025
‘RC16’ సెట్‌లో క్లీంకారా సందడి
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్‌లో చరణ్ కుమార్తె క్లీంకార సందడి చేశారు. చెర్రీ ఆమెను ఎత్తుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News February 6, 2025
47లక్షల రైతుల పరిస్థితి ఏంటి?: హరీశ్‌రావు
తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే ప్రభుత్వం 21.45 లక్షల మందికి రైతుభరోసా వేసిందని… మిగతా 47 లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుభరోసా మెుత్తం తొలుత రూ.7500 అని చెప్పి దానిని రూ.6వేలకే కుదించారన్నారు. ఎకరం లోపు భూమి ఉన్నవారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటుందని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
News February 6, 2025
ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.