News March 19, 2024

2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు: అశ్వినీ వైష్ణవ్

image

దేశంలోనే తొలి బుల్లెట్ రైలు <<12656938>>ప్రాజెక్టు<<>> ఫస్ట్ ఫేజ్ 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు రైలును నడుపుతామని, అహ్మదాబాద్- ముంబై మార్గం 2028కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్‌ను తీసుకొస్తామన్నారు. ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశం ఐదో స్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 11, 2026

జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

image

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News March 11, 2026

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

image

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.

News March 11, 2026

ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.