News February 5, 2025
రూ.1,126కోట్ల రైతుభరోసా నిధులు జమ: కాంగ్రెస్
TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ప్రారంభించిన రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు రూ.1,126కోట్లు జమ అయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఇవాళ ఒక్క రోజే 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని, మొత్తం ఇప్పటి వరకు 21.45 లక్షల మందికి నిధులు అందాయని స్పష్టం చేసింది. ఎకరాకు రైతు బంధు రూ.5వేలే వచ్చేవని, రైతు భరోసా కింద రూ.6వేలు అందుకుంటున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.
Similar News
News February 6, 2025
ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు
అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.
News February 6, 2025
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రద్దు
AP: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసేవారు. అర్హత ఉండి ఏదైనా పథకం అందకపోతే అప్లై చేసేవారు. అయితే ఇది వైసీపీ కార్యక్రమంగా మారిందని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
News February 6, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.