News February 5, 2025
కాళేశ్వరంలో కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన
కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పలువురు ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News February 6, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 06, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 6, 2025
ఎంజీయూలో అధికారుల పదవీకాలం పొడిగింపు
ఎంజీ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న వివిధ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న డా జి.ఉపేందర్ రెడ్డిని మరో ఏడాది, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా.మిరియాల రమేశ్, ఆడిట్ సెల్ అడిషనల్ డైరెక్టర్‌గా డా వై.జయంతిని మరో ఏడాది కొనసాగించనున్నారు.
News February 6, 2025
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి: నంద్యాల కలెక్టర్
బాధ్యతలు స్వీకరించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో అనుకూల దృక్పథం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ హాల్‌లో లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎన్.రాంబాబు స్ట్రేస్ మేనేజ్‌మెంట్, పాజిటివ్ థింకింగ్‌పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి తగ్గించుకునే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.