News February 5, 2025
కాగజ్‌నగర్‌లో దేశీదారు స్వాధీనం

కాగజ్‌నగర్‌లో బుధవారం దేశీదారు బాటిల్స్ పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దేశీ దారు స్వాధీనం చేసుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 7, 2026
మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
News March 7, 2026
వార్‌కు వారం!

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.


