News February 5, 2025

జనగామ: స్త్రీనిధి రుణాల రికవరీ శాతాన్ని పెంచాలి: కలెక్టర్

image

కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీఓఏలు, డీపీఎంలతో రుణాల రికవరీ, జిల్లాకు కేటాయించిన సమాచార సంక్షిప్త పరికరాలపై(E-pass machines) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10న రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రానున్న నేపథ్యంలో స్త్రీనిధి రుణాల రికవరీ పట్ల శ్రద్ధ వహించాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సూచించారు.

Similar News

News March 28, 2026

నంద్యాల జిల్లాలో ‘జీరో వేస్ట్’ కార్యక్రమం

image

నంద్యాల జిల్లాలో చెత్త రహిత సంస్థల (జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల దేవనగర్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News March 28, 2026

ఆంధ్రా అమ్మాయిలు అదరగొట్టారు

image

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బధిర అమ్మాయిల T10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఆంధ్రా జట్టు సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా 73/4 స్కోర్ చేయగా, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 68/4 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. టోర్నీలో రాణించిన కాంతమ్మకు ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.

News March 28, 2026

ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

image

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.