News February 5, 2025

భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!

image

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.

Similar News

News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

News February 6, 2025

భారత్‌తో శాంతి కోరుకుంటున్నాం.. కానీ: పాక్ పీఎం షరీఫ్

image

శాంతి పేరుతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన(ఆర్టికల్ 370 రద్దు) నుంచి బయటకు రావాలన్నారు. POK అసెంబ్లీలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం
✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం
✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం
✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం
✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం
✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం
✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

error: Content is protected !!