News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
Similar News
News February 6, 2025
దరఖాస్తు గడువు పెంపు
AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.
News February 6, 2025
అమెరికాలో తెలుగోళ్లు ఎంతమంది ఉన్నారంటే?
అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. అమెరికాలో తెలుగు వారు 12.30 లక్షలకుపైగా ఉన్నారు. ఎక్కువగా కాలిఫోర్నియా(2 లక్షలు)లో నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్(1.50 లక్షలు), న్యూజెర్సీ(1.10 లక్షలు), ఇల్లినాయిస్(83 వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(52 వేలు)లో ఉన్నారు. అక్కడ హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.
News February 6, 2025
సుమతీ నీతి పద్యం- ఎవరు బలవంతుడు?
లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం: కొండంత ఏనుగును మావటివాడు లొంగదీసుకుని దానిపై ఎక్కి కూర్చుంటాడు. అలాగే శరీర బలం ఉన్నవాడి కంటే నీతిమంతుడే నిజమైన బలవంతుడు.