News February 5, 2025

వెంకటగిరి: APSP హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

image

వెంకటగిరి ( వల్లివేడు )లోని APSP 9th బెటాలియన్‌లో పనిచేస్తున్న 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ మగ్గం నరసయ్య (35) బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన స్వగ్రామం పెళ్లకూరు మండలం జీలపాటూరు. ఆయనకు ఇటీవలే వివాహమయ్యింది. ఇతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం పట్ల బెటాలియన్‌లోని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.

Similar News

News February 6, 2025

దరఖాస్తు గడువు పెంపు

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 6, 2025

MNCL: ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు

image

సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కృషితోనే కారుణ్య నియామకాల ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుడు మరణించిన లేదా మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయిన వారసుడికి 40 సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం ఇస్తారని పేర్కొన్నారు.

News February 6, 2025

పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.

error: Content is protected !!