News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.
Similar News
News April 16, 2026
YouTube షార్ట్స్‌కు బానిస అయ్యారా? ఇలా చేస్తే కనిపించవు..

కొంత మంది గంటల తరబడి యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి టైమ్ మేనేజ్‌మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో ‘Shorts feed limit’ ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.
News April 16, 2026
యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News April 16, 2026
వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.


