News March 19, 2024
సీఎంవోకి చేరిన చిలకలూరిపేట పంచాయితీ
AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. స్థానిక వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడిని CM జగన్ పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఇన్‌ఛార్జ్‌గా రాజేశ్‌ని తప్పించిన అధిష్ఠానం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ కోసం మంత్రి రజినీ రూ.6.5కోట్లు తీసుకున్నారని రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.
Similar News
News December 29, 2024
త్వరలో 32వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 32,438 గ్రూప్-డి పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ వంటి పోస్టులు భర్తీ చేయనుంది. జనవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బేసిక్ సాలరీ రూ.18వేలు.
News December 29, 2024
H-1B వీసాలపై మౌనం వీడిన ట్రంప్
రిపబ్లికన్స్-ఎలాన్ మస్క్ మధ్య H-1B వీసాల వివాదంపై ట్రంప్ మౌనం వీడారు. H-1B వీసాల జారీ గొప్ప కార్యక్రమం అంటూ కొనియాడారు. గత తన హయాంలో పరిమితులు విధించినా తాజాగా సమర్థించారు. H-1B వీసాల కోసం యుద్ధం చేయడానికి సిద్ధమని మస్క్ ప్రకటించడంపై రిపబ్లికన్లు గుర్రుగా ఉన్నారు. MAGAలో భాగంగా స్థానికులకు పెద్దపీట వేయాలన్న రిపబ్లికన్ల డిమాండ్‌పై ట్రంప్ స్పందన కొత్త చర్చకు దారితీసింది.
News December 29, 2024
‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త
ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. మగపిల్లలే కావాలంటూ భార్యను కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పర్భానీలో ఉత్తమ్ కాలే అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.