News February 6, 2025
జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763994998_71675977-normal-WIFI.webp)
ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 6, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738779711298_695-normal-WIFI.webp)
అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్ లక్ష్యంగా US అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక US డాలర్‌తో పోలిస్తే ఆ దేశ కరెన్సీ 8,50,000 రియాల్స్‌కు పతనమైంది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యల్ప స్థాయి. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకు తీసుకువచ్చేలా ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంక్షలు తనకు ఇష్టం లేదని, చర్చలకు రావాలని ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738765206876_20397864-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.
News February 6, 2025
సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి: ADB కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763090698_51600738-normal-WIFI.webp)
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.