News February 6, 2025
బీఫామ్ అందుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులు మీదుగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి బీఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 19, 2026
పెరవలిలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
News March 19, 2026
సరఫరా కాదు డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య: కేంద్రం

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.
News March 19, 2026
కొత్తగూడెం జిల్లాలో రైతులకు భారీ ఊరట

కొత్తగూడెం జిల్లాలో రైతులకు శుభవార్త. ఈ నెల 22వ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 1.91 లక్షల మంది రైతులకు రూ.353.78 కోట్లు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున ముందుగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. దీంతో రైతులకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది.


