News February 6, 2025

సంగారెడ్డి : పదోతరగతి ఎన్ఆర్లో తప్పుల సవరణకు అవకాశం: డీఈవో

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాలకు సంబంధించిన పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల నామినల్ రోల్‌లో తప్పులను సరిచేసుకునేందుకు ప్రభుత్వ పరీక్షల బోర్డు డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చారని, పాఠశాల హెచ్ఎంలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 4, 2026

కడప: ఒక్క రోజులో 238 కేసులు నమోదు

image

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 4, 2026

ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

image

అమెరికా రీసెంట్‌గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్‌పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

News April 4, 2026

నల్లమలలో ఫైర్ అలర్ట్… అధికారుల తక్షణ చర్యలు

image

నల్లమల అడవిలో అనుమానాస్పదంగా చెలరేగిన అగ్ని ప్రమాదాన్ని అటవీశాఖ అధికారులు వేగంగా అదుపులోకి తీసుకువచ్చారు. రామమూర్తి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ స్వయంగా ఫైర్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం విశేషం. అడవుల్లో మంటలు పెట్టడం తీవ్రమైన నేరమని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీ సంరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.