News February 6, 2025
వికారాబాద్: అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తాం: అదనపు కలెక్టర్

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం, చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌లు, హౌసింగ్ ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్‌లకు పలు సూచనలు, సలహాలు చేశారు.
Similar News
News September 16, 2025
రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.
News September 16, 2025
KMR: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. అదేవిధంగా, కామారెడ్డి, దేవునిపల్లి, దోమకొండ ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన మరో 8 మందికి కోర్టు మొత్తం రూ.8,000 జరిమానా విధించింది.
News September 16, 2025
సంగారెడ్డి: పాఠశాలల పర్యవేక్షణకు అధికారుల నియామకం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రమణ కుమార్‌ను నియమించారని పేర్కొన్నారు. వీరు జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించనున్నారని తెలిపారు.