News February 6, 2025
197 మంది బాలకార్మికులను గుర్తించాం: SRPT ఎస్పీ

జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ పగడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిరాధరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 197 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించడం జరిగిందన్నారు. బాలలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు.
Similar News
News November 5, 2025
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈఓ

వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదో తరగతి స్పెషల్ క్లాసులను ఆమె తనిఖీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగుపడాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్ పాల్గొన్నారు.
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


