News February 6, 2025
NTR: మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా అజమ్‌ఘర్(యూపీ) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నం.07081 విజయవాడ మీదుగా గుంటూరు- అజమ్‌ఘర్ రైలును ఫిబ్రవరి 14న, నం.07082 అజమ్‌ఘర్- విజయవాడ ఫిబ్రవరి 16న నడుపుతున్నట్ల వివరించారు. నం.07081 రైలు 15న 12.20కి విజయవాడ చేరుకుని 16న సాయంత్రం 5.15 గంటలకు గయ చేరుకుంటుంది. 16న నం.07082 రైలు రాత్రి 7.45కి బయలుదేరి 18న ఉదయం 7.30కి విజయవాడ చేరుతుంది.
Similar News
News March 21, 2026
డిండి ప్రాజెక్టుకు నిధుల వరద

జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరందించే డిండి పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పనులు వేగవంతం చేసేందుకు ప్రగతి పద్దు కింద అదనంగా రూ.200 కోట్లు ఇచ్చింది. ప్రధాన పనులకు గతేడాది రూ.270 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.325.10 కోట్లు కేటాయించింది. కాలువలకు రూ.235 కోట్లు మంజూరు చేసింది. ఏదుల వద్ద నీటి మట్టం పెంపు ప్రతిపాదన వివాదంగా మారిన నేపథ్యంలో ఈ బడ్జెట్ పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 21, 2026
జనగామ: 35 శాతం రాయితీతో.. రూ.10 లక్షల వరకు రుణం!

మహిళలను స్వయం ఉపాధి వ్యాపారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ పరిశ్రమలను(పీఎంఎఫ్ఎంఈ) ఏర్పాటు చేయనుంది. ఈ పథకంలో 36 రకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు 35 శాతం రుణ రాయితీతో రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
News March 21, 2026
భర్తకు తీవ్ర అనారోగ్యం.. శ్మశానంలో వదిలివెళ్లిన భార్య!

TG: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్‌ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.


